పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్టు

ప్రధానాంశాలు

పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్టు

ఏడు ఆటోల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు

విజయవాడ (పటమట), న్యూస్‌టుడే: తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఇంటిపై దాడి కేసులో 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడలోని పటమట పోలీసులు శనివారం తెలిపారు. తమ ఇంటిపై సుమారు 50-60 మంది దాడిచేసి రూ.5 లక్షల విలువైన సామగ్రిని ధ్వంసం చేసినట్లు పట్టాభి భార్య చందన మంగళవారం ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 11 మందిని గుర్తించి అరెస్టుచేశారు. 7 ఆటోల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఇంట్లో దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని పట్టాభి కుటుంబసభ్యులకు నోటీసులు జారీచేశారు. వాటినీ పరిశీలిస్తే మరికొందరిని అదుపులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. అరెస్టయిన వారిలో బచ్చు మాధవీకృష్ణ, ఇందుపల్లి సభాషిణి, తుంగం ఝాన్సీరాణి,  బేతాల సునీత, గూడవల్లి భారతి, దండు నాగమణి, యల్లాటి కార్తీక్‌, గొల్ల ప్రభుకుమార్‌, వినుకొండ అవినాష్‌, వంకాయలపాటి రాజ్‌కుమార్‌, బచ్చలకూరి అశోక్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని