రేషన్‌ డీలర్ల నిరసనకు తెదేపా సంపూర్ణ మద్దతు: అచ్చెన్నాయుడు

ప్రధానాంశాలు

రేషన్‌ డీలర్ల నిరసనకు తెదేపా సంపూర్ణ మద్దతు: అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ డీలర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు తెదేపా సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. గతంలో వారికి ఉన్న అన్ని సదుపాయాల్ని ఇప్పుడు రద్దు చేయడమే కాకుండా వాలంటీర్లు, మొబైల్‌ వాహనాల పేర్లతో డీలర్లను డమ్మీలుగా చేశారని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘మా హయాంలో డీలర్లకు గౌరవవేతనం అందించాం. గోనె సంచులను అమ్ముకుని కొంత ఆదాయం పొందేలా వెసులుబాటు కల్పించాం. ప్రస్తుతం ఖాళీ గోతాలు కూడా ప్రభుత్వానికి అందించాలంటూ జీవో ఇచ్చి డీలర్లపై పెత్తనం చేస్తున్నారు. కరోనా సమయంలో పంపిణీ చేసిన ఉచిత రేషన్‌ సరకులకు సంబంధించిన కమీషన్‌ కూడా ఇవ్వలేదు. కరోనాతో 54 మంది డీలర్లు చనిపోయినా పట్టించుకోలేదు. రేషన్‌ డీలర్ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి...’ అని పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని