TS News: రైతుబిడ్డ చేవ.. కాడెద్దుగా సేవ
close

ప్రధానాంశాలు

TS News: రైతుబిడ్డ చేవ.. కాడెద్దుగా సేవ

నేలతల్లిని నమ్ముకుని సేద్యం సాగించే అన్నదాత ఎన్ని అవాంతరాలెదురైనా కాడి వదలడనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగార్‌గాం గ్రామానికి చెందిన కోవ అభిమాన్‌ ఆదివారం తనకున్న ఆరు ఎకరాల్లో పత్తి విత్తడం ప్రారంభించారు. ఉదయం నుంచి దుక్కి దున్నిన కాడెద్దుల్లో ఒకటి సాయంత్రం అకస్మాత్తుగా కుప్పకూలి మృత్యువాత పడింది. మిగతా రైతులూ వానాకాలం సాగు పనులు ముమ్మరం చేయడంతో మరో ఎద్దు అందుబాటులో లేక..ఇంటర్‌ చదివే తన కుమారుడు సాయినాథ్‌(20)ను ఇంకో ఎద్దుకు జతగా పెట్టి సోమవారం దుక్కి దున్నారు. ఆలస్యమైతే భూమిలో అదను పోతుందని, ఇప్పటికిప్పుడు మరో ఎద్దు కొనలేని పరిస్థితుల్లో ఇలా చేయకతప్పడం లేదని అభిమాన్‌ తెలిపారు.

-న్యూస్‌టుడే, ఇంద్రవెల్లిTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని