
తెలంగాణ
ఎందుకలా వ్యవహరిస్తోందో ప్రశ్నించండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం ఎందుకు సవతితల్లి ప్రేమ చూపుతోందో పార్లమెంట్లో ప్రశ్నించాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ‘చంద్రబాబు హయాంలో పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్రం అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు..2018-19లోనే రుణ సేకరణకు ఎందుకు పరిమితిని విధించలేదు? అప్పుడు పరిమితికి మించి అప్పులు చేశారంటూ ఇప్పుడు రాష్ట్ర నికర రుణ పరిమితి(ఎన్డీసీ)లో కోత పెట్టి దాన్ని వచ్చే మూడేళ్లవరకూ వర్తింపజేస్తామనడం సరికాదు’అనే విషయాన్ని పార్లమెంట్ ఉభయసభల్లోనూ ప్రస్తావించాలని తీర్మానించారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన 13 అంశాలతో పాటు, సదరన్ జోనల్ సమావేశంలో ఏపీ ప్రస్తావించిన ఆరు అంశాలను పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని ముఖ్యమంత్రి ఎంపీలకు మార్గదర్శనం చేశారు. ‘పోలవరం అంచనా వ్యయం రూ.55,657కోట్ల ఆమోదానికి కేంద్రాన్ని పట్టుబట్టాలి. ప్రాజెక్టుల్లో ఎప్పుడూ లేనివిధంగా తాగునీటి అంశాన్ని విడదీస్తే ఎలా? రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,104కోట్లను కేంద్రం తిరిగిచెల్లించేలా అడగాలి’ అని ఎంపీలను సీఎం కోరారు.