
గ్రేటర్ హైదరాబాద్
డిసెంబరు 1 నుంచి ప్రారంభం
తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశంలో తీర్మానం
ఈనాడు, అమరావతి: ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్ బ్యూరో నిర్ణయించింది. శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని పేర్కొంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో శుక్రవారం సమావేశమైంది. వరద మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. తుపాను ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని, వరద తీవ్రతకు ఇసుక మాఫియా చర్యలూ కారణంగా ఉన్నాయని పేర్కొంది. వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.