
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ప్రభుత్వం రూ.612.50 కోట్లు విడుదల చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ షాదీముబారక్ పథకానికి రూ.150కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్యాణ లక్ష్మి కోసం బీసీ సంక్షేమశాఖ మూడో త్రైమాసికం కింద రూ.462.50 కోట్లు ఇచ్చింది.