
ఆంధ్రప్రదేశ్
బకాయిలు ఇప్పించండి
సజ్జలకు విన్నవించుకున్న పాత సబ్ కాంట్రాక్టర్లు
ఈనాడు, అమరావతి: ‘పోలవరంలో 2016నాటి కాంట్రాక్టు సంస్థ వద్ద ఉప కాంట్రాక్టర్లుగా పనిచేశాం. మాకు సుమారు రూ.40 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది...’అని పలువురు సబ్ కాంట్రాక్టర్లు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైకాపా కేంద్ర కార్యాలయంలో కలిసి తెలిపారు. తమ సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. ‘ఆ రూ.40 కోట్లలో సగం చెల్లిస్తామని దానికి మా నుంచి బలవంతంగా సమ్మతి పత్రాలను అప్పట్లో తీసుకున్నారు. ఆ డబ్బు ఇవ్వలేదు. నాలుగైదేళ్లుగా గత ప్రభుత్వంలో, తర్వాత సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు...’అని వారు వివరించారు.