క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Fixing : బ్రెండన్‌.. ఓ వ్యాపారి.. ఫిక్సింగ్‌!

దిల్లీ: ఫిక్సింగ్‌ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కోసం ఓ భారత వ్యాపారి తనను సంప్రదించడం గురించి  ఐసీసీకి ఆలస్యంగా సమాచారమిచ్చినందుకు తనపై నిషేధం పడబోతోందని జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌ స్వయంగా వెల్లడించాడు. ఆ వ్యాపారితో సమావేశం సందర్భంగా తెలివి తక్కువతనంతో కొకైన్‌ తీసుకున్నానని, దాన్ని అడ్డంపెట్టుకుని తనను బ్లాక్‌మెయిల్‌ చేశారని చెప్పాడు. తాను బుకీల వలలో ఎలా పడ్డాడో.. ట్విట్టర్లో ఉంచిన ప్రకటనలో వివరించాడు బ్రెండన్‌. స్పాన్సర్‌షిప్స్‌, జింబాబ్వేలో టీ20 లీగ్‌ ప్రారంభం గురించి చర్చించడానికని ఓ వ్యాపారి 2019 అక్టోబరులో తనను భారత్‌కు పిలిచాడని అతడు తెలిపాడు.‘‘ఆ వ్యాపారితో సమావేశం సందర్భంగా అంతా మద్యం సేవించాం. వాళ్లు నాకు కొకైన్‌ అందించారు. వాళ్లూ తీసుకునే ఉన్నారు. తర్వాతి రోజు వాళ్లు నా హోటల్‌ గదిలోకి దూసుకొచ్చి.. అంతకుముందు రాత్రి నేను కొకైన్‌ తీసుకుంటుండగా తీసిన వీడియోను చూపించారు. తమ కోసం అంతర్జాతీయ క్రికెట్లో స్పాట్‌ ఫిక్సింగ్‌ చేయకపోతే వీడియోను జనాలకు చేరేలా చేస్తామని బెదిరించారు. నేను దిక్కుతోచని స్థితిలో పడ్డా. నా హోటల్‌ గదిలో వాళ్లు ఆరుగురు ఉండడంతో చాలా భయమేసింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కోసం వాళ్లు నాకు 15 వేల డాలర్లు ఇచ్చారు. పని పూర్తి చేశాక మరో 20 వేల డాలర్లు ఇస్తామని చెప్పారు. ముందు విమానమెక్కి భారత్‌ నుంచి బయటపడొచ్చనుకుని ఆ డబ్బు తీసుకున్నా. ఆ సమయంలో నాకు మరో మార్గం లేదు. తిరస్కరించే అవకాశమే లేదు’’ అని బ్రెండన్‌ వివరించాడు. ఆ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత దాని గురించి ఐసీసీకి చెప్పాలని బ్రెండన్‌ నిర్ణయించుకున్నాడు. అయితే తానెప్పుడూ ఫిక్సింగ్‌ చేయలేదని బ్రెండన్‌ స్పష్టం చేశాడు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.