ఎంపీడీవోలకు ఎట్టకేలకు పదోన్నతులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 237మంది ఎంపీడీవోలకు ఎట్టకేలకు పదోన్నతులు లభించాయి. వివిధ హోదాల్లో వారిని జిల్లాల్లో నియమిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవోల పదోన్నతులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఉత్తర్వులు వెలువడినా ఆర్థికశాఖ అనుమతి అవసరమవ్వడం, ఇతర కారణాలతో ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది. ప్రస్తుతం పదోన్నతి కల్పించిన వారిలో 118 మందిని జిల్లా జల యాజమాన్య సంస్థల్లో, 44 మందిని డివిజనల్‌ పంచాయతీ అధికారులుగా, ఆరుగుర్ని డీఆర్‌డీఏ పీడీలుగా, నలుగుర్ని జడ్పీ సీఈవోలుగా, 13 మందిని డిప్యూటీ సీఈవోలుగా, మరో నలుగుర్ని జిల్లా పంచాయతీ అధికారులుగా, 11 మందిని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో,  37 మందిని ఇతర ప్రభుత్వశాఖల్లో నియమించారు. ఎంపీడీవోలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించడంపై రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.బ్రహ్మయ్య, జీవీ నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని