అక్షరాభ్యాసం చేసిన 3వేల మంది చిన్నారులు

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతీ ఆలయం ఆదివారం కిక్కిరిసింది. మూలానక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసాలు చేయించేందుకు దాదాపు 3,000 మంది చిన్నారులతో కలిసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు చేరుకుని సరస్వతీదేవి, మహాలక్ష్మి, భువనేశ్వరీదేవిని దర్శించుకున్నారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం తాతాచార్యులు, బృందావనం రామ్‌గోపాలాచార్యులు ఆధ్వర్యంలో తులాభార సేవ జరిగింది. భక్తులకు ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనాలు అందించినట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెరుకూరి శ్రీధర్‌, జి.శ్రీనివాసరావు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు