ఐదున్నర అడుగుల సొరకాయ

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గుమ్మడి ఫణి.. పెరట్లో భారీ సొరకాయ కాసింది. వారణాసి నుంచి తెచ్చిన నాటు విత్తనాన్ని రెండు నెలల క్రితం పెరట్లో నాటారు. అది చావిడి పైభాగం మొత్తం అల్లుకుని పదుల సంఖ్యలో భారీ సొరకాయలు కాశాయి. సహజంగా అడుగు నుంచి అడుగున్నర పొడవు మాత్రమే కాస్తుంటాయి. కానీ ఇది ఏకంగా 5.5 అడుగుల పొడవు పెరిగి అందరినీ అబ్బురపరుస్తోంది. ఒకే మొక్కకు ఇలాంటివి 15 కాయలు కాయడం విశేషం. దీనిపై ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వి.మంజువాణి మాట్లాడుతూ.. భూమిలో పోషక విలువలు అధికంగా ఉండటం, పరిసరాల్లో ఇతర మొక్కలు లేకపోవడంతో అరుదుగా ఇలాంటివి పెరుగుతాయని పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, కొడాలి (ఘంటసాల)


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు