ఆర్జీయూకేటీలో ప్రమాదం

ఫాల్స్‌సీలింగ్‌ పలకలు ఊడిపడి విద్యార్థికి గాయాలు

ముథోల్‌, న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మంజీర వసతి గృహంలో గురువారం ఫాల్స్‌సీలింగ్‌ పలకలు ఊడి పడటంతో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీమత్‌ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి విద్యార్థులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.  విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు గతంలో ఆందోళన చేసినప్పుడు పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థులుండే గదులు, వసతి గృహాలకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు.అధికారులు  ఎలాంటి మరమ్మతులు చేయించలేదు.


మరిన్ని

ap-districts
ts-districts