రబ్బర్‌ ట్యూబుకు మృతదేహం కట్టారు!

  అంత్యక్రియల కోసం నదిని దాటేందుకు అవస్థలు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అనూప్పుర్‌ జిల్లావాసులు అంత్యక్రియల కోసం ఓ మృతదేహాన్ని నదికి ఆవల ఉన్న తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు పడిన పాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వరదతో పోటెత్తిన నర్మదానదిని దాటేందుకు గత్యంతరం కానరాక.. ఓ రబ్బర్‌ ట్యూబుకు మృతదేహాన్ని కట్టారు. థాడ్‌పథరా గ్రామవాసి విశ్మత్‌ నందా (55)కు గుండెపోటు రావడంతో డిండౌరీ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ ఆదివారం మధ్యాహ్నం ఆయన మృతిచెందారు. వంతెన వసతి లేకపోవడంతో అంబులెన్సు మృతదేహాన్ని నది వద్ద దించి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు రబ్బర్‌ ట్యూబు ఆధారంగా విశ్మత్‌ నందాను గ్రామంలోకి తీసుకువెళ్లారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిస్థితులను ఆరా తీస్తామని సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అభిషేక్‌ చౌధరి తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని