Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.  మేం చెప్తాం.. మీరు ఎస్‌ సర్ అనండి..!

మంత్రులు తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకే మంత్రులు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు పర్చేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చట్టాలు పేదల సంక్షేమానికి అడ్డుగా నిలవవని చెప్పారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమాన్ని ఏ చట్టమూ అడ్డుకోదని చెప్తూ.. మహాత్మా గాంధీ చెప్పిన మాటను ఉటంకించారు. ‘పేదల సంక్షేమానికి ఏ చట్టమూ అడ్డురాదని తెలుసు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బాలినేని జనసేనకు వెళ్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి

పార్టీలో సమన్వయం కోసం పనిచేస్తున్నానని.. అందుకే గిద్దలూరు నియోజకవర్గ వైకాపా నేతలతో సమావేశం ఏర్పాటు చేశానని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను జనసేనకు వెళ్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని.. అందుకే ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

3. ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

విజయవాడ: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జులై 22న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 39వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇతరుల రుణానికి హామీ సంతకం చేస్తున్నారా?

లోన్‌ తీసుకుంటున్నాను.. కాస్త హామీ సంతకం చేస్తారా? అని ఏ మిత్రుడో.. బంధువో.. అడిగితే మొహమాటానికో లేక వారిపై మీకున్న నమ్మకంతోనో వెంటనే అంగీకరిస్తుంటారు! దాని వెనకున్న రిస్క్‌ గురించి ఏమాత్రం ఆలోచించరు. నిజంగా మీ హామీ సంతకం తీసుకుంటున్న వ్యక్తి నమ్మకస్థుడైతే ఫరవాలేదు. కానీ, ఏవైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి హామీ కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఆ భారం మీరు మోయాల్సి రావొచ్చు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..

క్రికెట్‌ ఆడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన తుస్సార్‌ అనే వ్యక్తి నగరంలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం రాజేంద్రనగర్‌ పరిధిలోని సన్‌సిటీ ఎస్‌బీఐ గ్రౌండ్‌లో తుస్సార్‌ క్రికెట్‌ ఆడుతూ ఒక్కసారి కుప్పకూలిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. లాలూజీ.. మీ ఇంట్లోకి పాము మళ్లీ చొరబడింది..!

అనేక రాజకీయ నాటకీయ పరిణామాల తర్వాత బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. భాజపాతో బంధాన్ని తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్‌.. కొద్ది సేపట్లోనే ఆర్జేడీతో జట్టుకట్టి పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. అయితే నీతీశ్ తీరుపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఉద్దేశిస్తూ కొత్త పొత్తుపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం లాలూ చేసిన ఓ ట్వీట్‌ను ఉటంకిస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అందరికీ అవకాశాలు ఇస్తున్నారు.. సంజూకే ఎందుకిలా..?

సంజూ శాంసన్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టాలెంట్ ఎక్కువ.. అవకాశాలు తక్కువ. అవును అతడి  క్రికెట్‌ కెరీర్‌ సాగిన విధానం చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఎప్పుడో 2013లో అతడు భారత టీ20 లీగ్‌లో అడుగుపెట్టి అదరగొట్టాడు. 2015లోనే భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. దీంతో సంజూ భవిష్యత్‌లో భారత్‌కు కీలక ఆటగాడిగా ఉంటాడని అంతా భావించారు. అయితే, ఏడేళ్లు గడిచినా.. జట్టులో సుస్థిర స్థానం దక్కలేదు. మరి అతడికే ఎందుకిలా జరుగుతోందంటే..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్‌ వ్యాప్తి

చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్‌ మనుషులకు సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపావైరస్‌ ఇటీవల షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో కొందరికి వ్యాపించినట్లు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న ఈ పేషంట్ల నుంచి సేకరించిన స్వాబ్‌లో ఈ వైరస్‌ ఆనవాళ్లను గుర్తించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇది సరికొత్త రకం హెనిపావైరస్‌ అని పరిశోధకులు తెలిపారు. దీనికి లాంగ్యా హెనిపావైరస్‌గా పేరుపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని నటుడు నాగచైతన్య (Naga Chaitanya) బయటపెట్టారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి స్పందించారు. ‘‘మీ చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏమిటి? దానిని ఎందుకు వేయించుకున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘చేతి మణికట్టు దగ్గర మాత్రమే నాకు పచ్చబొట్టు ఉంటుంది. అదంటే నాకెంతో ఇష్టం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

.10. వరవరరావుకు బెయిల్‌ మంజూరు 

భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్‌ మంజూరు చేసినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే.. గ్రేటర్‌ ముంబయి దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన విధించింది. ఈ మేరకు వరవరరావుకు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత్‌ 75 ఏళ్ల ప్రయాణం.. 2 నిమిషాల వీడియోలో..!


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని