Telangana News: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి తూప్రాన్‌ గేట్‌ సమీపం వరకు విజయవాడ- హైదరాబాద్‌ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో అధ్వానంగా మారిన రహదారి మరమ్మతులు చేపట్టారు. ఓ వైపు రాఖీపౌర్ణమి రద్దీ, మరో పక్క రహదారి మరమ్మతులు చేపట్టడంతో శుక్రవారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ పెరిగింది. జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా వాహనాలను ఒకే దారిలో మళ్లించడంతో ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. దీంతో సుమారు 4కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. ట్రాఫిక్‌ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్‌, చౌటుప్పల్‌ పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ల మరమ్మతు పనులు ట్రాఫిక్ లేనప్పుడు, రాత్రి సమయాల్లో  చేస్తే బాగుండేదని, రద్దీ సమయంలో చేయడం వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని

ap-districts
ts-districts