Surya: హీరో సూర్య మొదటి సంపాదన ఎంతో తెలుసా...!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్ హీరోనే అయినా.. టాలీవుడ్‌ హీరోలతో సమానంగా తెలుగు అభిమానులను సంపాదించుకున్నాడు నటుడు సూర్య. ఈ హీరో అసలు పేరు శరవణన్‌ శివకుమార్‌. సినిమాల్లోకి వచ్చాక సూర్యగా అలరిస్తున్నారు. గజనీ, సింగం, ఆకాశమే నీ హద్దురా ఇలా విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఈ హీరో సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్ని గంటలు పనిచేశాడు, ఎంత తీసుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇటర్వ్యూలో సూర్య తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తను 18 గంటలు పని చేసి వెయ్యి రూపాయల కంటే తక్కువ జీతం తీసుకున్నానని తెలిపాడు.

‘‘మనం గొప్ప వాళ్లం అని మా నాన్న మాకెప్పుడూ చెప్పలేదు. నేను సినిమాల్లోకి రాకముందు దుస్తులు తయారు చేసి ఎగుమతి చేసే దుకాణంలో పని చేశాను. రోజుకు 18 గంటలు పనిచేసే వాడిని. నెలకు 736రూపాయల జీతం ఇచ్చేవాళ్లు’’అని చెప్పారు. సూర్య నటించిన సూరారై పోట్రూ (ఆకాశమే నీ హద్దురా) సినిమాకు ఇటీవల 5 జాతీయ చలన చిత్ర అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను సూర్య ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు. ఈ చిత్రం హిందీలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతోంది.


మరిన్ని