రవితేజ కుటుంబం నుంచి మరో హీరో.. ఏయ్‌ పిల్లా..!

హైదరాబాద్‌: కథానాయకుడు రవితేజ కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా రాబోతున్నాడు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్‌ భూపతిరాజు త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నారు. అతడిని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఆ చిత్రానికి ‘ఏయ్... పిల్లా’అనే టైటిల్ ఖరారు చేశారు. మరో విశేషం ఏంటంటే, మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ ఇందులో కథానాయిక. సెప్టెంబర్ నుంచి ‘ఏయ్... పిల్లా’ సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే విధంగా, 90వ దశకం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts