ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ప్రిక్వార్టర్స్‌లో భారత్‌

చెంగ్‌డు: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన గ్రూపు మ్యాచ్‌లో భారత జట్టు 3-1తో ఈజిప్ట్‌పై నెగ్గి నాకౌట్‌కు చేరుకుంది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ సత్తాచాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 11-6, 11-4, 11-1తో గోదా హాన్‌పై, 11-8, 11-8, 9-11, 11-6తో దీనా మిష్రెఫ్‌పై శ్రీజ విజయాలు నమోదు చేసింది. మనిక బాత్రా 8-11, 11-6, 11-7, 2-11, 11-8తో దీనా మిష్రెఫ్‌పై గెలుపొందింది. గ్రూపు దశలో భారత పురుషుల జట్టు 3-2తో కజకిస్తాన్‌పై గెలిచి నాకౌట్‌ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. సత్యన్‌ 11-1, 11-9, 11-5తో డెనిస్‌ జొలుదెవ్‌పై నెగ్గగా.. హర్మీత్‌ దేశాయ్‌ 6-11, 8-11, 9-11తో కిరిల్‌ చేతిలో ఓడాడు. మానవ్‌ ఠక్కర్‌ 12-10, 11-1, 11-8తో అలన్‌పై గెలిచి భారత్‌కు 2-1తో ఆధిక్యం అందించాడు. నాలుగో పోరులో సత్యన్‌ 11-6, 5-11, 14-12, 9-11, 6-11తో కిరిల్‌ చేతిలో ఓడాడు. నిర్ణయాత్మక అయిదో పోరులో హర్మీత్‌ 12-10, 11-9, 11-6తో జొలుదెవ్‌పై నెగ్గి 3-2తో భారత్‌కు విజయాన్ని అందించాడు. చివరి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై నెగ్గితే గ్రూపు-2లో భారత్‌ అగ్రస్థానం సాధిస్తుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని