పట్టణ ప్రాంతాల్లో హెచ్‌టీఎల్‌ఎస్‌ కండక్టర్ల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం సంప్రదాయక అల్యూమినియం కండక్టర్ల (ఏసీఎస్‌ఆర్‌) స్థానంలో అధిక వేడిని సైతం తట్టుకునే సామర్థ్యం గల అధునాతన ‘అధిక ఉష్ణోగ్రత, తక్కువ సాగే గుణం’(హెచ్‌టీఎల్‌ఎస్‌) కలిగిన కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నామని జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పరిధిలో సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కోసం ఈ కండక్టర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. విద్యుత్‌ సౌధలో మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల వేదిక ప్రతినిధులు సీఎండీని శాలువా కప్పి సత్కరించారు. తమకు పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని