2024 మార్చికి అన్ని పథకాల్లోకి బలవర్ధక బియ్యం

ఎఫ్‌సీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వెల్లడి

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని ఆహార భద్రత పథకాలకు మార్చి 2024 నాటికి ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి-12లతో కూడిన బలవర్ధక (ఫోర్టిఫైడ్‌) బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించిందని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రావు వెల్లడించారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లోని ఫోర్టిఫైడ్‌ బియ్యం నాణ్యతను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మూడు దశల్లో అన్ని ఆహార భద్రత పథకాలకు బలవర్ధక బియ్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మొదటి దశలో భాగంగా మార్చి 2022వరకు ఐసీడీఎస్‌-ఎండీఎంలకు బలవర్ధక బియ్యం పంపిణీ చేశామన్నారు.

రెండోదశలో మార్చి 2023నాటికి ఐసీడీఎస్‌, ఎండీఎంతో పాటు నిర్దేశిత ప్రజాపంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాలు, అవసరమైన ప్రాంతాలకు అందజేస్తున్నామని తెలిపారు. మూడోదశలో మార్చి 2024నాటికి అన్ని ఆహార భద్రత పథకాలకు బలవర్ధక బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. బియ్యం టెస్టింగ్‌ సొల్యూషన్‌తో పరీక్షించి వచ్చే రంగును బట్టి తాజానా? మరపట్టిన బియ్యమా? అనే విషయం గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని