close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అలసిన కళ్లకు...చల్లని పూత

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే... కంటినిండా నిద్రపోవడంతోపాటు మరికొన్ని చిట్కాలూ పాటించాలి. అవేంటంటే...

కళ్లు అలసినట్లుగా అనిపించినప్పుడు... చల్లని నీటిలో ముంచిన దూది ఉండలను మూసిన కళ్లపై పది నిమిషాలు ఉంచాలి. అక్కడ రక్తప్రసరణ జరిగి, తాజాగా మారతాయి.

గుడ్డులోని తెల్లసొనను ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. దీన్ని కంటి చుట్టూ పూతలా రాయాలి. పావుగంటయ్యాక చల్లని నీటితో కడిగేస్తే... అక్కడి చర్మం బిగుతుగా మారుతుంది.

కళ్ల చుట్టూ, కనురెప్పలకు కీరదోసరసంలో దూది ఉండను ముంచి రాయాలి. పావుగంటయ్యాక కడిగేయాలి. ఇలా అయిదు రోజులకొకసారి చేస్తే నల్లని వలయాలు మాయమవుతాయి.

చెంచా టొమాటో గుజ్జుకి పావుచెంచా పసుపు, అరచెంచా నిమ్మరసం, చెంచా సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాయాలి. అరగంట తరువాత దూది ఉండను నీటితో తడిపి ఆ పూతను తొలగించాలి. వారానికోసారి ఇలా చేస్తే కళ్ల కింద ఏర్పడిన మచ్చలు పోతాయి. రక్తప్రసరణ జరిగి చర్మం తాజాగా మారుతుంది.

చల్లని నీటిలో గ్రీన్‌ టీబ్యాగును ముంచి తీయాలి. ఈ బ్యాగును 15 నుంచి 20 నిమిషాలు కళ్లపై ఉంచితే, కళ్ల మంట చాలావరకు తగ్గుతుంది.

దూది ఉండను చల్లని పాలల్లో ముంచి పావుగంట సేపు కనురెప్పలపై అద్దుతూ ఉంటే కళ్లు కాంతిమంతంగా తయారవుతాయి.

చెంచా తేనెకు అరచెంచా బాదం నూనె కలిపి నిద్రపోయే ముందు కళ్లకు మృదువుగా మర్దన చేసుకోవాలి. దీంతో రక్త ప్రసరణ జరిగి అక్కడ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


మరిన్ని