close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ మరింత ముందుకు

ముంబయి: బ్రిటన్‌కు చెందిన కల్రాక్‌ కేపిటల్‌, యూఏఈ వ్యాపారవేత్త మురారి లాల్‌ జలాన్‌ కలిసి సంయుక్తంగా (కన్సార్షియమ్‌) సమర్పించిన దివాలా పరిష్కార ప్రణాళికకు జెట్‌ఎయిర్‌వేస్‌ రుణ సంస్థల కమిటీ అంగీకారం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఆన్‌లైన్‌లో జరిపిన ఓటింగ్‌ ఆధారంగా ప్రణాళికను ఆమోదించినట్లు జెట్‌ఎయిర్‌వేస్‌ దివాలా పరిష్కార వృత్తినిపుణుడు (ఆర్‌పీ) ఆశిష్‌ చౌచారియా బీఎస్‌ఈకి తెలియజేశారు. జెట్‌ఎయిర్‌వేస్‌కు రెండు బిడ్లు దాఖలు కాగా.. అందులో మురారిలాల్‌ జలాన్‌, కల్రాక్‌ కేపిటల్‌ సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ ఒకటి. రుణ సంస్థలు అంగీకారం తెలిపిన పై రుణ పరిష్కార ప్రక్రియకు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం కోసం సెక్షన్‌ 30(6) కింద దరఖాస్తును పంపే పనిలో ఆర్‌పీ ఉన్నారని, ఈ సమాచారాన్ని అవసరమైతే సభ్యులకు తెలియజేస్తామని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పొందుపరిచారు.

విమానాశ్రయ కౌంటర్‌లో చెక్‌ ఇన్‌కు రూ.100: ఇండిగో

విమానాశ్రయంలోని కౌంటర్ల వద్ద చెక్‌-ఇన్‌ కావాలనుకునే ప్రయాణికులు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో తెలిపింది. ఈ తరహా ఫీజును మొదలుపెట్టిన తొలి భారత విమానయాన కంపెనీ ఇదే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు