close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పెళ్లి చేయమని తొందరపెడుతోంది...

మా అమ్మాయి వయసు పద్దెనిమిదేళ్లు. రెండేళ్లుగా తను మమ్మల్ని పెళ్లి చేయమని తొందరపెడుతోంది. తనే మ్యాట్రిమోనీ సైట్లలో వివరాలు అప్‌లోడ్‌ చేసి వెతుక్కుంటోంది. చదువుపై దృష్టిపెట్టడం లేదు.  అలాగని సంబంధాలు వెతికి తెచ్చినా... తన అందం, వయసు, స్థాయికి సరిపోవడం లేదంటోంది. అసలు తనకేం కావాలో తెలియడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా? 

- ఓ సోదరి

మీ అమ్మాయి పెళ్లి చేయమని బిడియం, సంకోచం ఏ మాత్రం లేకుండా ఒత్తిడి చేయడం  సాధారణ విషయంలా అనిపించడం లేదు. ఈ లక్షణాలతోపాటు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం, అతిగా సంతోషపడటం, ఇతర అంశాల మీద ఆసక్తి లేకపోవడం, తనకు తాను గొప్పగా భావించడం...లాంటి లక్షణాలుంటే దాన్ని మానసిక రుగ్మతగా భావించొచ్చు. కుటుంబంలో ఎవరికైనా గతంలో మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తొచ్చు. అలానే తెలివితేటలు తక్కువగా ఉన్నవారికి పరిణతి కూడా తక్కువే ఉంటుంది. దాంతో ఇతరులను చూసి తామూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలా చేస్తే నగలు, దుస్తులు కొనుక్కోవచ్చనీ, సంతోషంగా గడిపేస్తామనీ అపోహ పడుతుంటారు. ముందు ఆమెను సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లండి. పరీక్షల తర్వాత... కౌన్సెలింగ్‌తో సరిపోతుందా? లేదా మందులు అవసరమా అన్నది నిర్ణయిస్తారు.


మరిన్ని