close

క్రీడలు

దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్‌ డికాక్‌

జొహానెస్‌బర్గ్‌: వచ్చే ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం దక్షిణాఫ్రికా సన్నాహాలు మొదలుపెట్టింది. సీనియర్‌ ఆటగాడు డుప్లెసిస్‌ స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించింది. వచ్చే నెలలో భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టుకు అతడినే సారథిగా ఎంపిక చేసింది. ఈ జట్టులో డుప్లెసిస్‌ సభ్యుడిగా కూడా లేడు. ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పిన సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ప్రపంచకప్‌ దిశగా యువ జట్టును సిద్ధం చేసుకోవాలన్నది దక్షిణాఫ్రికా వ్యూహంగా కనిపిస్తోంది. అయితే డుప్లెసిస్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరం పెడుతున్నట్లు భావించాల్సిన పని లేదని దక్షిణాఫ్రికా సెలక్టర్లు స్పష్టం చేశారు. టీ20ల తర్వాత జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు డుప్లెసిస్‌నే కెప్టెన్‌గా ప్రకటించారు. ఈ జట్టులో భారత సంతతికి చెందిన ఇద్దరు ఆటగాళ్లకు (కేశవ్‌ మహరాజ్‌, సెనురన్‌ ముత్తుస్వామి) చోటు దక్కడం విశేషం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు