close

గ్రేటర్‌ హైదరాబాద్‌

గద్ద చిక్కులు... కాకి తన్నులతో సరి!

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు.. ఓ గద్ద ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చింది. కొబ్బరి చెట్టుపై వాలేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గద్ద కాళ్లు కొబ్బరి మట్టలోని ఎండిన ఆకుల్లో ఇరుక్కుపోయాయి. కాళ్లను విడిపించుకుని, ఎగిరేందుకు గద్ద పెనుగులాడినా ఫలితం కనిపించలేదు. తలకిందులా వేలాడుతూ అరవసాగింది. దాని బాధను దూరం నుంచి గమనించిన కాకి ఒకటి ఎగురుతూ వచ్చింది. కొబ్బరి మట్టను, గద్దను రెండుమూడు సార్లు కాళ్లతో తన్నింది. ఆ తాకిడికి గద్ద కాళ్లు కొబ్బరి ఆకుల నుంచి బయటకొచ్చాయి. బతుకుజీవుడా అనుకుంటూ అది తుర్రుమని ఎగిరిపోయింది.
- ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు