close

తెలంగాణ

పునరుజ్జీవ పథకం పంపుహౌస్‌ల పరిశీలనకు సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంలో భాగంగా కొనసాగుతున్న రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంపుహౌస్‌ల నిర్మాణాలను పరిశీలించేందుకు మూడు, నాలుగు రోజుల్లో సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. పనుల పురోగతిని సమీక్షించేందుకు సీఎం రానున్నట్లు ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ 8వ ప్యాకేజీ గాయత్రి పంపుహౌస్‌ను సీఎం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఈఎన్‌సీ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు