close

బిజినెస్‌

అందుబాటు ధరల్లో విద్యుత్తు వాహనాలు!

జిప్‌ట్రాన్‌ సాంకేతికతను ఆవిష్కరించిన టాటా మోటార్స్‌
ఒకసారి ఛార్జింగ్‌తో 250 కిలోమీటర్ల ప్రయాణం

ముంబయి: విద్యుత్తు వాహనాల (ఈవీ)ను అందుబాటు ధరల్లో ఆవిష్కరించేందుకు టాటా మోటార్స్‌ ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో రూపొందించనున్న ఈవీల కోసం సరికొత్త పవర్‌ట్రెయిన్‌ (మోటార్‌)ను గురువారం సంస్థ విడుదల చేసింది. ఇందులో జిప్‌ట్రాన్‌ సాంకేతికత వాడినట్లు పేర్కొంది. అన్ని మోడళ్ల విద్యుత్‌ వాహనాలకూ ఈ పవర్‌ట్రెయిన్‌ ఉపయోగిస్తామని టాటా మోటార్స్‌ తెలిపింది. ఇందువల్ల విద్యుత్‌ వాహనాలు సరసమైన ధరల్లో లభిస్తాయని పేర్కొంది. జిప్‌ట్రాన్‌ సాంకేతికతతో రూపొందిన మోటార్‌లో సమర్థమైన అధిక వోల్టేజీ వ్యవస్థ, ఉత్తమ ప్రదర్శన, దీర్ఘకాలిక మన్నిక, వేగంగా ఛార్జింగ్‌, 8 ఏళ్ల బ్యాటరీ వారెంటీ, ఐపీ67 ప్రమాణాలు ఉన్నాయి. దుమ్ము-నీటి నుంచి రక్షణతో రూపొందిన ఈ బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ‘మా అంతర్జాతీయ ఇంజినీరింగ్‌ నెట్‌వర్క్‌ ఉపయోగించుకుని జిప్‌ట్రాన్‌ సాంకేతికతతో పవర్‌ట్రెయిన్‌ రూపొందించాం. దీన్ని సుమారు 10 లక్షల కిలోమీటర్లు పరీక్షించి చూశాం. ఇది దాని విశ్వసనీయతను రుజువు చేసుకొంద’ని టాటా మోటార్స్‌ ఎండీ, సీఈఓ గుంటెర్‌ బషెక్‌ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు