close

ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం

దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర గురువారం అమ్మవారి విరూపోత్సవం కార్యక్రమంతో ముగిసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో బుధవారం ఈ జాతర మొదలైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలేరమ్మ తల్లిని 5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూలరథంపై పోలేరమ్మ తల్లిని ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడవునా చిన్నాపెద్దా తేడా లేకుండా లక్షలాది మంది భక్తులు నవధాన్యాల మొలకలు, వేయికళ్ల దుత్తలు మొక్కుబడులుగా సమర్పించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన పోలేరమ్మ ఊరేగింపులో యువత కేరింతలు, చిందులతో సందడి చేసింది.

-న్యూస్‌టుడే, వెంకటగిరి

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు