close

తెలంగాణ

డిసెంబరు వరకు 68 ప్రత్యేక రైలు సర్వీసులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్గాల్లో డిసెంబరు నెలాఖరు వరకు 68 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. దసరా, దీపావళి, క్రిస్మస్‌తో పాటు శీతాకాలంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. కాచిగూడ-శ్రీకాకుళం మధ్య.. రాయనపాడు మీదుగా 26 సర్వీసులు. అక్టోబరు 6 నుంచి డిసెంబరు 29 వరకు ప్రతి ఆదివారం బయల్దేరుతాయి. శ్రీకాకుళం నుంచి కాచిగూడకు అక్టోబరు 7 నుంచి డిసెంబరు 30 వరకు ప్రతి సోమవారం బయల్దేరుతాయి. కాచిగూడ నుంచి శ్రీకాకుళంకు వయా విజయవాడ మరో 14 సర్వీసులు. ప్రతి మంగళవారం కాచిగూడ నుంచి బయల్దేరి శ్రీకాకుళం వెళ్లే ప్రత్యేకరైళ్లు అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటాయి. శ్రీకాకుళం నుంచి తిరుపతికి 14 ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి. శ్రీకాకుళం నుంచి ప్రతి బుధవారం బయల్దేరే రైళ్లు అక్టోబరు 2 నుంచి డిసెంబరు 25 వరకు తిరుపతికి వెళతాయి. తిరుపతి నుంచి కాచిగూడకు 14 ప్రత్యేకరైలు సర్వీసులు నడిపిస్తున్నామని అక్టోబరు 3 నుంచి జనవరి 2 వరకు ప్రతి గురువారం బయల్దేరుతాయని దక్షిణమధ్యరైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.

హైదరాబాద్‌ ఎర్నాకులం మధ్య..
హైదరాబాద్‌ ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌ ఎర్నాకులం మధ్య అక్టోబరు 2 నుంచి 30 వరకు ప్రతి బుధవారం, ఎర్నాకులం నుంచి హైదరాబాద్‌కు అక్టోబరు 3 నుంచి 31 వరకు ప్రతి గురువారం మొత్తం 10 ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు