close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వేడుకల్లో స్టైలిష్‌గా...

వేడుకల్లో స్టైలిష్‌గా...

పార్టీవేర్‌ అనగానే ఆడంబరంగా ఉండే లెహెంగాలు, అనార్కలీలు, పట్టు చీరలు, పరికిణీల ధగధగలే ఎక్కువగా కనిపిస్తాయి.  కానీ ఓ చిన్న పుట్టినరోజు వేడుక్కి అంత హడావిడి అవసరం లేకపోవచ్చు. ఆఫీసులో బిజినెస్‌ మీట్‌కి ఆ దుస్తులు అసలే నప్పవు. కాలేజీలో ఫేర్‌వెల్‌ పార్టీ, స్నేహితులతో కలిసి ఆనందించే సందర్భం ఏదైనా సరే! కాస్త ప్రత్యేకంగా కనిపిస్తేనే కదా... మనదైన స్టైల్‌. అలా సింపుల్‌గా కనిపిస్తూనే స్టైలిష్‌ లుక్‌తో మెరిసిపోవాలనుకునేవారి కోసం కొన్ని చిట్కాలు  సూచిస్తున్నారు ఇస్సా స్టూడియో నిర్వాహకులు.
న్ని సందర్భాలకు పట్టు, బెనారస్‌, రాసిల్క్‌ వంటి ఖరీదైన, బరువైన వస్త్రాలే  ఉపయోగించాల్సిన అవసరంలేదు. సిల్క్‌, క్రేప్‌, జార్జెట్‌ వంటి జాలువారే వస్త్రాల్లోనూ దుస్తులు కుట్టించుకోవచ్చు.
* పై నుంచి కిందకు ధోతీ స్టైల్‌ కుర్తాను కుట్టించుకుని ఓ పెప్లమ్‌ టాప్‌ని జత చేసి చూడండి. అయితే రెండూ ఒకే తరహా వస్త్రంలో, రంగుల్లో లేకుండా చూసుకోవాలి. అంటే కుర్తాకు జార్జెట్‌ని ఎంచుకుంటే దాని మీదకు పెప్లమ్‌ టాప్‌ కోసం కాటన్‌ సిల్క్‌ని ప్రయత్నించండి. అలానే దీనిమీదకు పొడవాటి ష్రగ్‌ కూడా బాగుంటుంది.
* కేప్‌, డబుల్‌ కేప్‌, లాంగ్‌ కేప్‌, లాంగ్‌ ష్రగ్‌ వంటివన్నీ... ఆహార్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు. పొడవాటి స్కర్టుకు ఒకవైపు డ్రేప్‌ డిజైన్‌ కోసం చిన్నచిన్న ప్లీట్స్‌ పెట్టించుకోవచ్చు. దాని మీదకు బ్యాట్‌ స్లీవ్స్‌తో టాప్‌ లేదా పెప్లమ్‌ క్రాప్‌ టాప్‌ని ఎంచుకోవచ్చు. వీటిని చీరల మీదకు వేసుకునే బ్లవుజులకూ జతచేసుకోవచ్చు. అంతేకాదు సన్నగా తీరైన ఆకృతితో కనిపించాలనుకునేవారికి ఈ రకం బాగుంటాయి
* ఏ సందర్భానికైనా స్టైలిష్‌గా కనిపించే మరో ప్యాటర్న్‌ హై అండ్‌ లో. దీనిలో హెమ్‌ డ్రెస్‌ వావ్‌ అనిపిస్తుంది. పొట్టభాగం దగ్గర చిన్న చీలికతో డిజైన్‌లా చేసిన జంప్‌ సూట్‌ ఆఫీస్‌ వేర్‌గా అదిరిపోతుంది. కాలేజీ వేడుకల్లో అయితే దీంతో కనికట్టు చేయవచ్చు. దీనిలో బాటిల్‌ గ్రీన్‌ రంగుని ఎంచుకుంటే సిల్వర్‌ వాచ్‌, షూస్‌, చెవులకు లోలాకులు...మెరిపిస్తాయి.
* సాధారణ కుర్తీనే ఎసెమెట్రికల్‌ కట్‌లో కుట్టించుకోవచ్చు. దీనికి స్లీవ్స్‌లో రఫుల్స్‌ ప్రయత్నించవచ్చు. అలానే కాస్త పొడవాటి గౌన్‌కి గేరాతో పాటు అడుగు భాగంలో అంచు రఫుల్స్‌ని కుట్టించుకుంటే ఏ వయసు వారికైనా చక్కగా నప్పుతుంది.
* సాధారణ షిఫాన్‌ వస్త్రాన్ని కూడా స్ట్రెయిట్‌ కట్‌ డ్రెస్‌లా కుట్టించుకుని ఒకవైపు కుచ్చిళ్లు కుట్టిస్తే ఎంత కళగా ఉంటుందో! దీనికి మెటాలిక్‌ జిప్‌ అదనపు అందాన్ని తెచ్చిపెడుతుంది.
* ఇక రంగులంటారా... ఎరుపు, నీలం, ఆకుపచ్చ వంటి ప్రాథమిక రంగులు కాకుండా బాటిల్‌గ్రీన్‌, బ్లష్‌, పీచ్‌, పర్పుల్‌ వంటివాటితోపాటు పేస్టల్‌ రకాలని మేళవింపుగా వాడుకుంటే మీ ఆహార్యం పూర్తిగా మారిపోతుంది.

వేడుకల్లో స్టైలిష్‌గా...


మరిన్ని