close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కళ్ల మేకప్‌ కనికట్టు చేసేలా...!

ముఖ అందాన్ని రెట్టింపు చేయడంలో కళ్లే కీలకం. అది సాధ్యం కావాలంటే కొద్దిపాటి అలంకరణ తప్పనిసరి. అలాంటి చిట్కాలే ఇవి.

* కళ్లు చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా అందాన్ని తెచ్చిపెట్టాలంటే కాటుక పెట్టుకోవాల్సిందే. అందుకోసం నాణ్యమైన ఐలైనర్‌ని ఎంచుకోవాలి. దీన్ని వాడేముందు కళ్ల చుట్టూ టిష్యూతో ఓసారి తుడవాలి. ఆపై ఐలైనర్‌తో అవుట్‌లైన్‌ గీసుకోవాలి. అలాని మరీ దూరంగా కాకుండా వీలైనంత వరకూ కనురెప్పలకు దగ్గరగా గీయడం వల్ల సహజంగా కనిపించొచ్చు. మీ వయసు, రంగుని బట్టి నలుపు, బ్రౌన్‌, గ్రే రంగుల్లో ఉండే ఐలైనర్‌లను ఎంచుకోవచ్చు.
* కళ్లకు మస్కారా వేసుకునేటప్పుడు కనురెప్పల కొలను నుంచి కొనల వరకూ గీయండి. అది ఆరక ముందే ఐలాష్‌ కర్లర్‌ని ఉపయోగించి వంపు తిప్పండి. పూర్తిగా ఆరిన తరవాత అలా చేస్తే కనురెప్పలకున్న వెంట్రుకలు రాలిపోతాయి.
* అలంకరణ అంతా అయ్యాకే ఐషాడో వాడాలి. ఇలా చేయడం వల్ల కళ్లు తాజాగా కనిపిస్తాయి. కళ్లు కలువ రేకుల్లా కనిపించాలంటే లేత రంగుల్లో ఉండే ఐషాడోని ఎంచుకోవాలి. కొన్నిసార్లు ముదురు రంగులు కూడా బాగుంటాయి. కళ్లను మరింత హైలైట్‌ చేస్తాయి.


మరిన్ని