close

తాజా వార్తలు

స్నానం చేస్తున్న మహిళను వీడియో తీసిన బాలుడు

చాంద్రాయణగుట్ట: స్నానం చేస్తున్న మహిళను రహస్యంగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన బాలుడిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. జంగమ్మెట్‌ రవీంద్రనాయక్‌ కాలనీకి చెందిన మహిళ (28) ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో 17 ఏళ్ల బాలుడి కుటుంబం నివసిస్తోంది. బాలుడు అప్పుడప్పుడు మహిళ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. నెల రోజుల క్రితం మహిళ స్నానం చేస్తుండగా బాలుడు తన సెల్‌ఫోన్‌లో రహస్యంగా వీడియో తీశాడు. వీడియో దృశ్యాలను తన స్నేహితులకు పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ ఈనెల 16న ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు రోజులైనా బాలుడిపై చర్యలు తీసుకోవడం లేదని మనస్తాపంతో సదరు మహిళ సోమవారం ఛత్రినాక పోలీసు స్టేషన్‌ ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీడియో దృశ్యాలను డిలిట్‌ చేయడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులను సంప్రదించామని, నివేదిక అందకపోవడంతోపాటు బాలుడు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాస్తుండడంతో చర్యలు తీసుకోలేదని పోలీసులు మహిళకు నచ్చచెప్పి పంపించారు. మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో పోలీసులు స్పందించారు. నిందితుడైన బాలుడిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి జువైనల్‌హోంకు తరలించారు. ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు