close

తాజా వార్తలు

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్‌!

ఈ సారైనా గెలవాలని అభిమానుల కోరిక

బెంగుళూరు: యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు  తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం సోమవారం తన జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేశాడు. ఇందుకు సబంధించిన ఫొటోలను కోహ్లీ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో 2008 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్‌కోహ్లీ ఇప్పటివరకూ మూడు ఫైనల్స్‌లో ఆడాడు. ఈ మూడు మ్యాచుల్లో ఆర్సీబీ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. ఆర్సీబీ మొదటిసారి 2009లో డెక్కన్‌ చార్జర్స్‌ చేతిలో ఓటమిపాలైనప్పుడు కోహ్లీ యువ ఆటగాడిగా ఉన్నాడు. తర్వాత 2011లో రెండోసారి ఫైనల్‌ చేరినప్పుడు టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఒకడిగా ఉన్నాడు. అనంతరం మూడోసారి తన సారథ్యంలోనే 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమిచవిచూశాడు. 

ఈ నేపథ్యంలో రాబోయే వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ సారథ్యంలో టీమిండియా మొదటిసారి మెగా ఈవెంట్‌లో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి వన్డే ప్రపంచకప్‌ ఫేవరెట్‌ జట్లలో టీమిండియా ఒకటిగా కనిపిస్తున్న సందర్భంగా కోహ్లీ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. అలాగే ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఆర్సీబీకి అందనిద్రాక్షలా మారిన టైటిల్‌ విన్నర్‌నూ కోహ్లీ అందిపుచ్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు