close

తాజా వార్తలు

హార్దిక్‌పటేల్‌కు పోటీగా జడేజా భార్య! 

జామ్‌నగర్‌: క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా వచ్చే లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన రివాబా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సీటు ఆశిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తమ అభ్యర్థిగా పాటిదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ను బరిలోకి దించాలని యోచిస్తోంది. దీంతో జామ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
గుజరాత్‌లోని కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న రివాబా.. క్షత్రియ వర్గీయుల మద్దతుతో ఈ నెల మొదటివారంలో భాజపాలో చేరారు. జామ్‌నగర్‌లో ప్రస్తుతం భాజపా నాయకురాలు పూనమ్‌ మాదమ్‌ ఎంపీగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూనమ్‌.. ప్రముఖ కాంగ్రెస్‌ నేత, తన బంధువైన విక్రమ్‌ మాదమ్‌పై విజయం సాధించారు.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. రానున్న ఎన్నికల్లోనూ బలమైన నాయకులను దింపి మరోసారి క్లీన్‌స్వీప్‌ చేయాలని కమలం పార్టీ యోచిస్తోంది. భాజపా నేడు లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు కాంగ్రెస్‌ కూడా భాజపాకు దీటైన నాయకుల కోసం వ్యూహాలు రచిస్తోంది. మరి గెలుపెవరిదో తెలియాలంటే మే 23 దాకా ఆగాల్సిందే. 

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు