close

ఆంధ్రప్రదేశ్

శవ రాజకీయాలు చేస్తున్న జగన్‌: మంత్రి కళా

లావేరు గ్రామీణం, న్యూస్‌టుడే: వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. తొలుత గుండెజబ్బుతో చనిపోయినట్లు ప్రచారం చేశారని, సాక్ష్యాలను తారుమారు చేయడానికి రక్తపు మరకలను ఎందుకు లేకుండా చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు చిన్నాన్న వివేకానందరెడ్డితో రాజీనామా చేయించడానికి జగన్‌ నానా ప్రయత్నాలు చేశారని, సోనియా వద్దకు వెళితే టికెట్టు ఇవ్వడం కుదరదని ఆమె చెప్పారని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జగన్‌ తండ్రి మాట వినలేదని, ఇప్పుడు రాష్ట్రానికి సీఎం అవుతాను.. ప్రజలు కష్టాలు తీర్చుతానని పేర్కొనడం విడ్డూరమని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రాన్ని కేంద్రానికి, కేసీఆర్‌కు తాకట్టు పెట్టడం ఖాయమని విమర్శించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు