close

ఆంధ్రప్రదేశ్

ఓటేెద్దాం.. సమర్థులను ఎన్నుకుందాం

‘‘నాకు ఓటుంది. ఈ దఫా ఎన్నికల్లో నేనూ ఓటెస్తా. మీరూ ఓటెయ్యండి. సమర్థ నాయకులను ఎన్నుకుందాం’’ అని అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ నగరంలో స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. దీనికి ఆమె హాజరై యువతను ఉత్సాపరిచేలా ప్రసంగించారు. అనంతరం నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల మానవహారం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌, నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, స్వీప్‌ కన్వీనర్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ క్రితికా శుక్లా, జేసీ-2 పి.బాబూరావు, డీటీసీ ఇ.మీరాప్రసాద్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, విజయవాడ క్రీడలు

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు