మార్కెట్‌ ధర తక్కువగా ఉన్న షేర్లలో...
close

Updated : 13/08/2021 03:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్‌ ధర తక్కువగా ఉన్న షేర్లలో...

కెనరా రొబెకో వాల్యూ మ్యూచువల్‌ ఫండ్‌

ష్టభయం తక్కువగా ఉండి.. దీర్ఘకాలిక కాంపౌండింగ్‌ పద్ధతిలో అధిక విలువ సాధించే లక్ష్యంతో ‘వాల్యూ ఫండ్‌’ను కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ‘కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 27. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. క్రయవిక్రయాలు వచ్చే నెల 6వ తేదీ నుంచి మొదలవుతాయి. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. సిప్‌ (క్రమానుగత పెట్టుబడి) పద్ధతిలో అయితే నెలకు రూ.1,000 మదుపు చేయాలి. ప్రధానంగా అధిక వాస్తవిక విలువ ఉండి, మార్కెట్‌ ధర తక్కువగా కంపెనీ షేర్లను పెట్టుబడి కోసం ఎంచుకోవటం, తద్వారా మదుపరులకు అధిక లాభాలు తెచ్చిపెట్టటం ఈ పథకం ప్రధానోద్దేశం. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ సూచీని దీనికి ప్రామాణికంగా పరిగణిస్తారు. కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ కు విశాల్‌ మిశ్రా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. వాల్యూ ఫండ్‌ విభాగంలో ఇప్పటికే ఇతర మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నుంచి పథకాలు ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో వాల్యూ ఫండ్స్‌ సగటున 11.6 శాతం ప్రతిఫలాన్ని ఆర్జించాయి. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్ సూచీలు ఎంతో అధికంగా ఉన్న పరిస్థితుల్లో వాల్యూ ఫండ్స్‌ ద్వారా అధిక విలువ కలిగి ధర తక్కువగా ఉన్న ఈక్విటీ షేర్లపై  పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఎంచుకోవటం మేలనే అభిప్రాయం ఉంది. అంతేగాక తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో కొంత వైవిధ్యం ఉండాలనుకునే మదుపరులకు కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ అనుకూలంగా ఉంటుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని