స్పైస్‌జెట్‌ నుంచి 38 దేశీయ విమాన సర్వీసులు - 38 domestic flights from SpiceJet
close

Published : 16/09/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్పైస్‌జెట్‌ నుంచి 38 దేశీయ విమాన సర్వీసులు

దిల్లీ: స్పైస్‌జెట్‌ కొత్తగా 38 దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ఈ నెలాఖరు లోగా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు స్పైస్‌జెట్‌ వెల్లడించింది. విశాఖపట్నం-ముంబయి, దిల్లీ-సూరత్‌, బెంగళూరు- వారణాసి, ముంబయి- జయపుర, చెన్నై-పుణె, చెన్నై- జయపుర.. తదితర నగరాల మధ్య వీటిని నిర్వహిస్తారు. ఉదయ్‌పూర్‌- చెన్నై, దిల్లీ- మాలే నగరాల మధ్య సర్వీసులు ప్రారంభించనున్నారు.  దుబాయ్‌ నుంచి ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్‌, కోచి, కొజికోడ్‌, అమృత్‌సర్‌, మంగళూరు నగరాలకు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించినట్లు స్పైస్‌జెట్‌ పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని