భారత్‌లో యాపిల్‌ రిటైల్‌ స్టోర్స్‌ - Apple to open retail stores in India says CEO Tim Cook
close

Updated : 28/01/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో యాపిల్‌ రిటైల్‌ స్టోర్స్‌

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్‌.. భారత్‌లో త్వరలో రిటైల్‌ స్టోర్లను తెరవనుంది. ఇప్పటి వరకు థర్డ్‌ పార్టీ రిటైల్‌ ఔట్‌లెట్స్‌పై ఆధారపడుతున్న ఈ కంపెనీ త్వరలో సొంతంగా స్టోర్లను ప్రారంభించనుంది. గతేడాది ప్రారంభించిన ఆన్‌లైన్‌ స్టోర్‌కు విశేషాదరణ లభించడం, తద్వారా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వ్యాపారం రెట్టింపు (ఏడాదికి ఏడాదితో పోలిస్తే) అవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిటైల్‌ స్టోర్ల గురించి ఆ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్ ప్రకటన చేశారు.

ఇప్పటికే కొన్ని ఐఫోన్‌ మోడళ్లను తయారు చేస్తున్న యాపిల్‌.. రిటైల్‌ స్టోర్లను తెరవడం ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ఆ కంపెనీకి శాంసంగ్‌, వన్‌ప్లస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 26తో ముగిసిన త్రైమాసికం ఫలితాలపై టిమ్‌ కుక్‌ మాట్లాడుతూ.. భారత్‌లో వ్యాపారం వృద్ధి చెందినప్పటికీ అక్కడున్న అవకాశాలతో పోలిస్తే చేరుకోవాల్సిన లక్ష్యం ఇంకా ఎక్కువగా ఉందని అభిప్రాయడ్డారు. దాన్ని భర్తీ చేసేందుకు త్వరలో రిటైల్‌ స్టోర్లను తెరవనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ రాణించడానికి ఆన్‌లైన్‌ స్టోర్‌ ఎంతగానో దోహదం చేసిందన్నారు. యాపిల్‌ గతేడాది సెప్టెంబర్‌ 23న భారత్‌లో ఆన్‌లైన్‌ స్టోర్‌ను తెరిచింది. ముంబయిలో తొలి రిటైల్‌ స్టోర్‌ను తెరిచే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. 

ఇవీ చదవండి..
భారత్‌లో తగ్గనున్న ఐఫోన్ ధరలు..
మొబైల్‌ ఛార్జింగ్‌..ఈ తప్పులు చేస్తున్నారా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని