ఫిక్స్‌డ్ డిపాజిట్లు: వ‌డ్డీ ఒక్క‌టే కాదు..ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను చూడాలి - Benefits-of-bank--fixed-deposit-beyond-interest-rate
close

Updated : 05/06/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిక్స్‌డ్ డిపాజిట్లు: వ‌డ్డీ ఒక్క‌టే కాదు..ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను చూడాలి


బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో.. పెట్టుబ‌డిదారులు రిస్క్ త‌క్కువ‌గా ఉండే ఇత‌ర మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. మ‌దుప‌ర్లు  ఎఫ్‌డీల‌ను ర‌ద్దు చేసే ముందు వీటి వ‌ల్ల చేకూరే ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

కోవిడ్ -19 వ్యాప్తి నేప‌ధ్యంలో బ్యాంకులు కొన్ని ప్ర‌త్యేక ఎఫ్‌డీల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో పెట్టుబ‌డి పెట్టిన వారికి ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, బీమా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్నాయి. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే కాకుండా బ్యాంకు అందించే ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను చూడాలి. 

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు గురించి డీసీబీ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ హెడ్ ప్ర‌వీణ్ కుట్టి మాట్లాడుతూ..   వ‌డ్డీ రేట్లు త‌గ్గిన‌ప్ప‌టికీ  త‌క్కువ రిస్క్ తీసుకునే వారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే న‌మ్మ‌క‌మైన పెట్టుబ‌డి మార్గం. అందువ‌ల్ల బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వృద్ధి రేటు ఇప్ప‌టికీ  బాగానే ఉంది. అంతేకాకుండా కోవిడ్‌-19 స‌మ‌యంలో బ‌య‌ట‌కు వెళ్లి ఖ‌ర్చులు చేసే వీలులేదు. చాలా మంది క‌స్ట‌మ‌ర్లు ఖర్చుల‌ను త‌గ్గించుకుని, ఎక్కువ పొదుపు చేసేందుకు చూస్తున్నారు. ప్ర‌స్తుతం మార్కెట్లు  వాటి జీవిత కాల గ‌రిష్టాల‌ను చేరుకోవ‌డ‌మూ ఒక కార‌ణ‌మే. మ‌దుప‌ర్లు వైవిధ్య‌త కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటున్నారు. అని తెలిపారు. 

సెబి రిజిస్ట‌ర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ..  బ్యాంక్ ఎఫ్‌డీలు క‌చ్చిత‌మైన రాబ‌డిని ఇస్తాయి. స్టాక్ మార్కెట్లలో హెచ్చు త‌గ్గులు ఉంటాయి. కాబ‌ట్టి ఒక‌రి పోర్ట్‌ఫోలియోలో ఎఫ్‌డీ క‌చ్చితంగా ఉండాలి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో మార్కెట్లు త‌గ్గినా, ఎఫ్‌డీలు ఆదుకుంటాయి. వీటికి తోడు బ్యాంక్ ఎఫ్‌డీల‌తో ఆదాయ‌పు ప‌న్ను, ఓవ‌ర్‌డ్రాఫ్ట్ వంటి ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. 

ఇత‌ర ప్ర‌యోజ‌నాలు..
1. ఆదాయ‌పు ప‌న్ను..
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం దీర్ఘ‌కాల  ఫిక్స్‌డ్ డిపాజిట్ల రాబ‌డిపై భార‌తీయ బ్యాంకులు ప‌న్ను మిన‌హాయింపును అందిస్తున్నాయి. ఈ ప‌న్ను-ర‌హిత బ్యాంక్ ఎఫ్‌డీల కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. 

2. ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యం..
 బ్యాంక్ ఎఫ్‌డిని ఫండ్ రైజింగ్ కోసం కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యాన్ని కూడా అందిస్తున్నాయి బ్యాంకులు. 

3. వాల్యు-యాడెడ్ బెనిఫిట్స్‌..
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి ఎటువంటి వైద్య ప‌రీక్ష‌లు లేకుండా జీవిత బీమాను ఉచితంగా ఇస్తున్నాయి కొన్ని బ్యాంకులు. హామీ మొత్తం.. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు స‌మానంగా ఉంటుంది. వ్య‌క్తి వ‌య‌సు, ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల‌ప‌రిమితుల‌కు లోబ‌డి గ‌రిష్ట బీమా ఉంటుంది.  మ‌రికొన్ని బ్యాంకులు ఎఫ్‌డీ చేసిన వారికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచిత క‌న్స‌లేస్ట‌న్ ఆప్ష‌న్‌ను ఇస్తున్నాయి.  ఈ ప్ర‌యోజ‌నాలు ప్ర‌ధానంగా వాల్యు-యాడెడ్ బ్యాంక్ ఎఫ్‌డీల‌లో లభిస్తున్నాయి. 

4. క‌చ్చిత‌మైన రాబ‌డి..
చిన్న మొత్తాల పొదుపు ప‌ధ‌కాల మాదిరిగా బ్యాంకు వ‌డ్డీ రేట్లలో హెచ్చుత‌గ్గులు ఉండ‌వు. అందువ‌ల్ల ఇది పెట్టుబ‌డి దారునికి క‌చ్చిత‌మైన రాబ‌డిని ఇస్తుంది. 

5. పెట్టుబ‌డులు పెట్ట‌డం సుల‌భం..
భార‌త్ డిజిలీక‌ర‌ణ వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఈ స‌మ‌యంలో ఎఫ్‌డీ  చేయాల‌నుకున్నవారు ఖాతా తెరిచేందుకు గంట‌ల త‌ర‌బ‌డి లైన్లో వేచి చూడాల్సి అవ‌స‌రం లేదు. నెట్ బ్యాంకింగ్ స‌దుపాయం ద్వారా ఆన్‌లైన్‌లో ఖాతా  నిమిషాల్లో తెర‌వ‌చ్చు. అందువ‌ల్ల బ్యాంక్ ఎఫ్‌డీలు మ‌దుప‌ర్ల‌కు పెట్టుబ‌డి సౌల‌భ్యాన్ని అందిస్తున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని