కార్లు +28%.. బైక్‌లు -35% - Car sales increased bike sales decreased
close

Published : 09/04/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్లు +28%.. బైక్‌లు -35%

దిల్లీ: ఈ ఏడాది మార్చిలో ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు 27.39 శాతం పెరిగి 2,79,745 కు చేరాయి. 2020 మార్చిలో 2,17,879 వాహనాలను కంపెనీలు విక్రయించాయని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య(ఫాడా) వెల్లడించింది. దేశంలోని 1482 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో (ఆర్‌టీఓ) 1277 ఆర్‌టీఓల నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్‌ సమాచారం ప్రకారం.. ద్విచక్ర వాహన విక్రయాలు మార్చిలో 35.26 శాతం క్షీణించి 11,95,445కు, వాణిజ్య వాహనాలు 42.2 శాతం తగ్గి 67,372కు, త్రిచక్రవాహనాల అమ్మకాలు 50.72 శాతం క్షీణతతో 38,034కు పరిమితమయ్యాయి. ట్రాక్టర్‌ అమ్మకాలు మాత్రం 29.21 శాతం పెరిగి 69,082కు చేరాయి. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి విక్రయాలు 23,11,687 నుంచి 28.64 శాతం క్షీణతతో 16,49,678కు చేరాయి.‘సుమారు 3.2 కోట్ల మంది మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిపై కొవిడ్‌-19 ప్రభావం చూపింది. ఇంధనం, వాహనాల ధరలు పెరగడం వల్ల కూడా వాహనాల కొనుగోలు తగ్గింద’ని ఫాడా ప్రెసిడెంట్‌ వింకేశ్‌ గులాటి అభిప్రాయపడ్డారు.

సెప్టెంబరు త్రైమాసికంలో ఎక్స్‌యూవీ 700

దిల్లీ: ప్రీమియం స్పోర్ట్స్‌ వినియోగ వాహనం ఎక్స్‌యూవీ 700ను ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబరు) విపణిలోకి విడుదల చేయనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది. ఈ కొత్త మోడల్‌ను డబ్ల్యూ601 ప్లాట్‌ఫామ్‌పై రూపొందించినట్లు తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని