close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/07/2020 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈపీఎఫ్‌ ఖాతా బదిలీతో పన్ను మినహాయింపు

డబ్బు వెనక్కి తీసుకొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఆ సమయంలో డబ్బులేకపోవడంతో చాలామంది ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్‌ నుంచి 55లక్షలకు పైగా చందాదారులు రూ.15,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే, ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందో రాదో చూసుకోవడం ముఖ్యమని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు.

ఆదాయపన్ను పరిధిలోకి మీరు ఉపసంహరించుకొనే డబ్బులు వస్తే కొంత నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ఐదేళ్ల సర్వీస్‌ తర్వాత ఉపసంహరిస్తే మాత్రం అసలు, వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని అంటున్నారు. అంతకన్నా ముందే డబ్బులు తీసుకుంటే ఉద్యోగి, యజమాని చేసిన జమపై వడ్డీకి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగి జమ చేసిన మొత్తానికి మాత్రం సెక్షన్‌ 80సి ప్రకారం మినహాయింపు పొందవచ్చు.

ఉద్యోగి ఆరోగ్యం బాగాలేక, అనివార్య కారణాల వల్ల యజమాని వ్యాపారం నిలిపివేసినా ఉపసంహరించే డబ్బుపై పన్ను ఉండదు. ఒకవేళ మీరు ఉద్యోగం మారితే కొత్త యజమానికి సంబంధించిన వివరాలతో ఖాతాను బదిలీ చేయించుకుంటే సర్వీస్‌ కొనసాగింపు లభించి పన్ను మినహాయింపునకు అర్హత పొందుతారు. ఉద్యోగం మారినప్పుడు యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) ఉపయోగించుకొని ఖాతాను బదిలీ చేసుకోవాలి. పాత ఖాతా నుంచి కొత్తదానిలోకి డబ్బులు బదిలీ అవ్వగానే మినహాయింపు, ఉపసంహరణకు అర్హత పొందుతారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.