కెయిర్న్‌ను ఓ కంట కనిపెట్టండి - Find Cairn at a glance Finance Ministry reference to PSBs
close

Published : 09/05/2021 05:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెయిర్న్‌ను ఓ కంట కనిపెట్టండి

పీఎస్‌బీలకు ఆర్థిక శాఖ సూచన

దిల్లీ: కెయిర్న్‌పై విధించిన 1.2 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.9,000 కోట్లు) పన్నును రికవరీ చేసుకోవడానికి ఆ కంపెనీ విదేశాల్లో ఉన్న మన డిపాజిట్లను జప్తు చేయకుండా గట్టి నిఘా విధించాలని ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు ఆర్థిక శాఖ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ తీర్పు ఇచ్చినట్లుగా తనకు 1.2 బిలియన్‌ డాలర్లను వడ్డీతో పాటు భారత్‌ చెల్లించకపోతే విదేశాల్లో భారత్‌కున్న ఆస్తులన్న జప్తు చేసుకుంటానని కెయిర్న్‌ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్‌లలో భారత బ్యాంకులకు చెందిన నగదు ఉండడం వల్ల వాటిని సులువుగా జప్తు చేసి ఆర్బిట్రేషన్‌ తీర్పును అమలు చేసే అవకాశం ఉంది. అటువంటి నగదును జప్తు చేయకుండా పీఎస్‌బీలు జాగ్రత్తగా ఉండాలని, అలాంటిదేమైనా జరిగితే వెంటనే తమకు చెప్పాలని ఆర్థిక శాఖ సూచించినట్లు ఈ అంశాలతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. బ్యాంకుల్లో ఉన్నవి ప్రభుత్వ నిధులు కావని.. అవి ప్రజల డబ్బు కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక నోడల్‌ అధికారిని సైతం ఆర్థిక శాఖ నియమించినట్లు తెలుస్తోంది. వెనకటి తేదీ నుంచి పన్ను చెల్లింపుల కింద కెయిర్న్‌ నుంచి భారత్‌ 1.2 బిలియన్‌ డాలర్లను వసూలు చేయగా.. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టుల్లో కెయిర్న్‌ గెలుపొందిన విషయం తెలిసిందే.


బాండ్లు లేకుండానే ఎగుమతులు, దిగుమతులు

కంపెనీలకు సీబీఐసీ అనుమతులు

దిల్లీ: బాండ్లను పూచీకత్తుగా పెట్టకుండానే వ్యాపారులు వస్తువుల దిగుమతి, ఎగుమతి చేయడానికి కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు(సీబీఐసీ) అనుమతించింది. జూన్‌ చివరి వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుంది. కరోనా కారణంగా ఎగ్జిమ్‌ వాణిజ్యానికి ఆలస్యం లేదా ఇబ్బందులు కలగకుండా ఈ చర్య ఉపయోగపడుతుందని సీబీఐసీ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. బాండ్ల స్థానంలో ఒక హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. కస్టమ్స్‌ అనుమతుల విషయంలో బాండ్ల స్థానంలో హామీపత్రాన్ని అనుమతించాలంటూ వ్యాపార వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఐసీ తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని