close

Published : 25/02/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కీల‌క మైలురాయి దాటిన‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు రికార్డు స్థాయికి చేరుకోవ‌డంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ. 9 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది.

మెరుగైన నిక‌ర వ‌డ్డీ మార్జిన్లు, అధిక వ‌డ్డీయేత‌ర ఆదాయం మ‌రియు స్థిర‌మైన ఆస్తి నాణ్య‌త‌తో డిసెంబ‌ర్ త్రైమాసిక ఆదాయాలు బ్యాంక్ ఊహించిన‌దానికంటే మెరుగ్గా ఉండ‌టంతో బ్యాంక్ షేర్లు మంచి పెరుగుద‌ల‌ను చూశాయి.

బీఎస్ఇలో బ్యాంక్ షేర్లు రికార్డు స్థాయిలో రూ. 1,635ను తాకాయి. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ గురువారం మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ. 9 ల‌క్ష‌ల కోట్ల‌ను దాటింది. 

ఈ ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఒక్కో షేరు రూ. 1,630 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టివ‌ర‌కు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ 13.5% పెరిగింది. రూ. 9.01 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ క్యాప్‌తో, దేశంలో ఈ మైలురాయిని సాధించిన 3వ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.

బిలియ‌నీర్ ముఖేష్ అంబానీ యొక్క రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ రూ. 13.25 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భార‌త్‌లోనే అత్యంత విలువైన సంస్థ‌. టీసీఎస్ 2వ స్థానంలో రూ. 11.17 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యొక్క డిజిట‌ల్ కార్యక్ర‌మాలు మ‌రియు పెరుగుతున్న ఆర్థిక కార్య‌క‌లాపాలు రిటైల్ రుణ వృద్ధిని పెంచుతాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిక‌ర వ‌డ్డీ ఆదాయం 15.1% పెరిగింది. రుణ వృద్ధి 16 శాతానికి పెరిగింది. కోర్ ఫీజు, క‌మీష‌న్ ఆదాయం వ‌రుస‌గా 26% పెరిగాయి.

స్థూల నిర‌ర్ధ‌క ఆస్తులు (నాన్ ఫెర్‌ఫార్మింగ్ అసెట్స్‌), నిక‌ర ఎన్‌పీఏలు త్రైమాసికంలో వ‌రుస‌గా 0.8% మ‌రియు 0.1%కి మెరుగుప‌డ్డాయి.


 

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని