మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోండిలా.. - How to check your PF balance
close

Published : 26/12/2020 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోండిలా..

 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ త్వరలో పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీరేట్లను చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. 2019-20 ఏడాదికి గానూ 8.5 శాతం వడ్డీని జమ చేయాలని ఇటీవల నిర్ణయించింది. డిసెంబర్‌ చివరి నాటికి ఆ మొత్తాలు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ నేపథ్యంలో మీ ఖాతాల్లో పీఎఫ్‌ మొత్తం జమ అయ్యిందో లేదో సులభంగా తెలుసుకోండిలా..

ఉమాంగ్‌ యాప్‌
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమాంగ్‌ యాప్‌లోని ఈపీఎఫ్‌వోను ఎంచుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌’ విభాగంలోకి వెళ్లి ‘వ్యూ పాస్‌బుక్‌’ను క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్‌ నంబర్‌తో పాటు మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనిపించే మెంబర్‌ ఐడీని క్లిక్‌ చేయడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్‌ ఖాతాతో మొబైల్‌ నంబర్‌ ముందే జత చేసి ఉండాలి. 

మిస్డ్ కాల్ స‌ర్వీస్‌
ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్‌ ఇచ్చిన తర్వాత ఓ రింగ్‌ అయి వెంటనే కాల్‌ కట్‌ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్‌ వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో ప్రత్యక్షమవుతాయి. 

SMS ద్వారా
యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్‌ ఖాతాకు జత చేసిన మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబ‌ర్‌కు ఎస్సెమ్మెస్‌ పంపించాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్సెమ్మెస్‌ పంపించాలి. 

ఈపీఎఫ్‌వో పోర్టల్‌ 
ఈపీఎవో సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న స‌భ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్‌ సర్వీసెస్‌’లోని ‘మెంబర్‌ పాస్‌బుక్‌’ విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. వివరాలు ఎంటర్‌ చేయడం ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని