Stock Market: లాభాలతో మొదలైన సూచీలు - Indices open in Green
close

Updated : 15/07/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాలతో మొదలైన సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. దీంతో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 53వేల మార్క్‌ను దాటగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 15,800పైన కదలాడుతోంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 120 పాయింట్ల లాభంతో 53,024 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 15,885 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై బలమైన అంచనాల నేపథ్యంలో ఈ రంగ షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, రిలయన్స్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని