Trai data: జియో బిగ్‌ జంప్‌.. ఎయిర్‌టెల్‌కు పెరిగిన చందాదారులు.. వీఐకి మళ్లీ నిరాశ! - Jio Airtel add mobile subscribers in July
close

Published : 23/09/2021 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Trai data: జియో బిగ్‌ జంప్‌.. ఎయిర్‌టెల్‌కు పెరిగిన చందాదారులు.. వీఐకి మళ్లీ నిరాశ!

దిల్లీ: ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో మరోసారి పెద్ద సంఖ్యలో చందాదారులను తన ఖాతాలో వేసుకుంది. జులై నెలలో ఏకంగా 65.1 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 44.32 కోట్ల మంది చందాదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జులై నెలకు సంబంధించిన సబ్‌స్క్రైబర్ల డేటాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసింది.

జులై నెలకు గానూ ఎయిర్‌టెల్‌లో కొత్తగా 19.42 లక్షల మంది చందాదారులు చేరారు. దీంతో ఆ కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 35.40 కోట్లకు చేరింది. ఇదే సమయంలో వొడాఫోన్‌ ఐడియా 14.3 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. దీంతో ఆ కంపెనీ వైర్‌లెస్‌ చందాదారుల సంఖ్య 27.19 కోట్లుగా నమోదైంది. అలాగే, దేశంలో మొత్తం టెలిఫోన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 120.9 కోట్లకు చేరినట్లు ట్రాయ్‌ తెలిపింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని