close

Published : 03/03/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 50,7388 వద్ద , నిఫ్టీ 15,064 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఉదయం 9:33 గంటల సమయానికి సెన్సెక్స్‌ 324 పాయింట్లు ఎగబాకి 50,617 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 15,024 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.24 వద్ద కొనసాగుతోంది.

ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. అమెరికాలో కరోనా ఉద్దీపన పథకంతో ప్రపంచ‌ మార్కెట్లు సానుకూలంగా కదలాడే అవకాశం ఉందన్న సంకేతాలు ఆసియా మార్కెట్లను నడిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి. బాండ్ల మార్కెట్ల వల్ల తలెత్తిన ప్రతికూలతల నుంచి సోమవారం అక్కడి సూచీలు భారీ పుంజుకున్న విషయం తెలిసిందే. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఇక దేశీయంగా స్పెక్ట్రమ్‌ వేలం ముగియడంతో టెలికాం రంగ షేర్లపై మదుపర్లు దృష్టి సారించనున్నారు. ఈ పరిణామాలన్నీ నేడు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.

ఆటో మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, మారుతీ సుజుకీ ఇండియా, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని