విక్రయాల్లో స్విఫ్ట్‌ నంబర్‌ 1 - Maruti Suzuki Swift Was The Best Selling Car In FY21
close

Published : 13/04/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విక్రయాల్లో స్విఫ్ట్‌ నంబర్‌ 1

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో 2020-21 కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ కారు అత్యధికంగా అమ్ముడైంది. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన కార్ల విక్రయాల్లో మారుతీకి చెందిన మోడల్సే తొలి 10 స్థానాల్లో ఏడు   ఉన్నాయి.  ఇక తొలి ఐదు స్థానాల్లో మారుతీ  తప్ప మరో కంపెనీ మోడల్‌ కారేలేదు.  2017-18 నుంచి తొలి ఐదు స్థానాలు మారుతీకే దక్కుతున్న విషయం తెలిసిందే. 

మారుతీ స్విఫ్ట్‌  అత్యధికంగా 1.72లక్షల కార్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న బ్యాలినో కార్లను 1.63 లక్షల మేరకు విక్రయించారు. మూడో స్థానంలో  ఉన్న వేగనార్‌ కారు మొత్తం 1.6 లక్షల యూనిట్లను విక్రయించారు. నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న ఆల్టో, డిజైర్‌ మోడళ్లను 1.59 లక్షలు, 1.28 లక్షలు విక్రయించారు. ఇక టాప్‌-10 మోడల్స్‌లో ఉన్న ఏకైక సెడాన్‌ సుజుకీ డిజైర్‌ కావడం విశేషం. ఈ ఐదు కార్లు మొత్తం  కలిపి మొత్తం కార్ల విక్రయాల్లో 30శాతాన్ని ఆక్రమించాయి.   ఇక ఆరు నుంచి పదో స్థానంలోపు మొత్తం మూడు హ్యూండాయి మోడళ్లు ఉన్నాయి.  క్రెటా (1,20,035), మారుతీ ఎకో (1,05,081), హ్యూందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ (1,00,611), మారుతీ విటారా బ్రెజా (94,635), హ్యుందాయ్‌ వెన్యూ (92,972) కార్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.       

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని