పీఎస్‌ఈల ప్రైవేటీకరణ విధానం బడ్జెట్‌లో! - PSE privatization policy in the budget!
close

Published : 29/01/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఎస్‌ఈల ప్రైవేటీకరణ విధానం బడ్జెట్‌లో!

దిల్లీ: వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర విభాగాల్లోని ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లలో ప్రభుత్వ వాటా ఉపసంహరణకు వీలుకల్పించే సరికొత్త ప్రైవేటీకరణ విధానానికి సంబంధించిన ప్రణాళికను రాబోయే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ వ్యూహాత్మక రంగాల్లోని పీఎస్‌యూల్లో తన వాటా అట్టేపెట్టుకోవాలని కేంద్రం భావిస్తున్నదీ అప్పుడే వెల్లడించొచ్చని ఈ అంశాలతో సంబంధమున్న ఇద్దరు అధికారులు తెలిపారు. తాజాగా ఆమోదించిన కొత్త ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌ఈ) విధానంలో వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలను విభజించారు. జాతి ప్రయోజనాలకు కీలకంగా ఉండే వాటిని వ్యూహాత్మక రంగాలుగా పరిగణించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పీఎస్‌ఈ(సీపీఎస్‌ఈ)ల్లో మైనారిటీ వాటా విక్రయం ద్వారా రూ.17,957 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. మొత్తం 249 సీపీఎస్‌ఈలుండగా.. వీటి మొత్తం టర్నోవరు రూ.24 లక్షల కోట్లు; నికర విలువ రూ.12 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో 54 కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని